మౌలిక సదుపాయాల అభివృద్ధి : కార్పొరేటర్ శ్రావణ్

 


మల్కాజ్ గిరి, వార్తానిధి: డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మల్కాజ్ గిరి బిజెపి కార్పొరేటర్ వూరపల్లి శ్రావణ్ అన్నారు.

డివిజన్ పరిధిలోని మారుతినగర్లో రహదారి నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని వివరించారు. ప్రజా సమస్యలను తనకు తెలియజేస్తే.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని స్థానికులకు చెప్పారు.

ప్రజల సహకారంతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ.. పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల్లో ప్రజలు సహకరించాలని కోరారు.

#Malkajgiri #GHMC #Roadworks #CorporatorSravan

Post a Comment

Previous Post Next Post