దీపావళి పండుగ వెనుక ప్రచారంలో ఉన్న ఇతిహాసం

 

దీప‌పు వెలుగును  పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు.దీపాల‌ను ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. 

దీపం ల‌క్ష్మీ రూపానికి సంకేతం. దీపావ‌ళి అంటే దీపాళ వ‌రుస అని అర్థం. ఈరోజు మ‌హాల‌క్ష్మీ ఉపాస‌న చేస్తారు. 

ప్ర‌తి ఇంట్లోనూ ముఖ్యంగా వ్యాపార‌స్తులైతే త‌ప్పనిస‌రిగా ఆరోజు సాయంత్రం ఇంట్లో ల‌క్ష్మీ పూజ చేసి బాణాసంచా కాలుస్తారు. మ‌రి దీపావళి రోజునే ల‌క్ష్మీ పూజ ఎందుకు చేస్తారంటే! దీనికొక ఇతిహాసం ప్ర‌చారంలో ఉంది. 

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావ‌తం మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.

అది చూచిన దూర్వాసనుడు కోపంతో ఇంద్రున్ని శ‌పిస్తాడు. దాని ఫ‌లితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రున్ని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. 

శ్రీహ‌రి చెప్పిన ప్ర‌కారం ఇంద్రుడు పూజ చేయ‌గా..ఆ పూజ‌కి  తృప్తిచెందిన లక్ష్మీదేవి తిరిగి దేవేంద్రునికి త్రిలోకాధిపత్యాన్ని అనుగ్ర‌హిస్తుంది. 

ఆ స‌మ‌యంలో ఇంద్రుడి ప్రార్థ‌న‌ను అనుస‌రించి జ్యోతి రూపంలో కొలిచే భ‌క్తుల ఇంట్లో నేను అష్ట‌ల‌క్ష్ములుగా వెలుగొందుతాన‌ని స‌మాధాన‌మిచ్చింది. అందుక‌ని ఈరోజు విశేషంగా ల‌క్ష్మీ దేవి పూజ చేస్తారు.


#Deepawali #FestivalOfLights #varthanidhi #Deepawali2021

Post a Comment

Previous Post Next Post