జహీరాబాద్ శాంతినగర్ హనుమాన్ దేవస్థానం.. |
జహీరాబాద్ పట్టణంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో శాంతినగర్ హనుమాన్ దేవాలయం ఒకటి. కొన్ని దశాబ్దాల క్రితం హనుమంతుడు ఇక్కడ కొలువుదీరారు.
అప్పటి నుంచి భక్తుల పూజలందుకుంటూ తన కృపను కురిపిస్తున్నారు. ప్రత్యేకంగా సింధూర పూజను.. తమలపాకుతో పూజలను స్వామికి చేస్తుంటారు. అభిషేకాలు.. అర్చనలు జరుగుతుంటాయి.
ప్రతి ఏడాది శ్రీరామ నవమి వేడుకలను భక్తులంతా కలిసి కన్నుల పండువగా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఆలయం బయట విశాలమైన స్థలం ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పరిసరాల్లో సమయాన్ని గడుపుతారు.
Tags:
స్థానికం