దేశంలో జనాభా అసమతుల్యత పెను సమస్యగా మారిందని.. దానిని నియంత్రించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దసరా సందర్భంగా నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో సంఘ్ శ్రేణుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
దేశంలో జనాభా నియంత్రణ విధానాన్ని మరోమారు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని దానిని రూపొందించాలన్నారు. అందరికీ సమానంగా వర్తింపజేయాలని స్పష్టం చేశారు.
భారతదేశ ఎదుగుదల, ఔన్నత్యాన్ని కొన్ని దేశాలు తమ స్వప్రయోజనాలకు అడ్డంకిగా భావిస్తున్నాయని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజల్ని బయపెట్టేందుకు ఉగ్రవాదులు హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
కుల ఆధారిత వక్ర భావాలతో నిండిన మన సామాజిక స్పృహను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భగవత్ అన్నారు.
Tags:
జాతీయ వార్తలు