బంగ్లాదేశ్ అనిశ్చితి నేపథ్యంలో అప్రమత్తత అవసరం

 


నిజానికి బంగ్లాదేశ్ కంటే ముందు రిజర్వేషన్ల పేరిట అల్లర్లు మన దేశంలోనే జరిగాయి.
మణిపూర్ లో మైతేయిలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ కూకీలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లేక మరేదైనా కారణం కావొచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా సరిగ్గా స్పందించలేదనే విమర్శలు వచ్చాయి.
తరువాత మైతేయిల నుంచి తిరుగుబాటు మొదలవ్వగానే ప్రతిపక్షాలు ఎప్పటిలాగే విధ్వంసకారుల తరపున విక్టీం కార్డు వాడటం మొదలుపెట్టాయి.
ఇరువైపులా సమాన ఘర్షణ, ప్రతి ఘర్షణ జరగడం వల్ల పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చాయి.
లేదంటే కూకీల చేతిలో మైతేయిలు అంతమయ్యే పరిస్థితులే కనిపించాయి.
కానీ ఎందుకో కేంద్ర ప్రభుత్వం చాలా మెల్లగా స్పందించి పరిస్థితులను ఇంకా అదుపులోకి తెస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకు రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక మరేదైనా అంతర్జాతీయ శక్తికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించిందా అనే అనుమానాలు లేకపోలేదు.
పైన చెప్పింది రిజర్వేషన్ల పరంగా జరిగింది. ఇక్కడ నేను బెంగాల్ నుంచి అక్రమ బంగ్లాదేశీ వలసలు, అస్సాం నుంచి అక్రమ మయన్మార్ వలసల గురించి నేను ప్రస్తావించదలచుకోలేదు.
ఎందుకంటే జాతీయవాద ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా బలం సరిపోవడం లేదనే సాకుతో ఆ పార్టీ నేతలు అక్రమ వలసల విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇతర ఫక్తు రాజకీయ పార్టీల ధోరణినే.. అంటే ఓట్లు సీట్లు అనే ధోరణినే ప్రస్తుత, గత అధికార పార్టీ ప్రదర్శిస్తోంది.
ఇప్పుడు రిజర్వేషన్ల నెపంతోనే బంగ్లాదేశ్ అల్లర్లు మొదలై ఆ దేశంలో సైనిక పాలన వచ్చింది. అంటే మొదట మణిపూర్ లో ప్రయోగం చేసిన అనంతరం.. బంగ్లాదేశ్ లో దాన్ని అమలుపరిచారు. అందుకు అక్కడి ప్రతిపక్ష పార్టీలను వాహకాలుగా చైనా, పాకిస్థాన్, సీఐఏ వంటివి ఉపయోగించుకొని ఉండవచ్చు.
ఎందుకంటే ఎంతో శిక్షణ పొందినవారు తప్పితే.. సాధారణ ప్రజలు ఇలాంటివి చేయలేరు.
అందుకు ఉదాహరణ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, పాలస్తీనాలోని హమాస్, ఆఫ్రికన్ దేశాల్లో బోకో హరాం వంటి వాటిని చెప్పుకోవచ్చు.
ఇలాంటి సంస్థలకు అధికార దాహం లేదా ఇతర ప్రయోజనాలను ఆశించే వారి సహకారం ఎల్లప్పుడూ మెండుగా ఉంటుంది. కాబట్టి ఫండింగ్ చేసే సంస్థలు వీరిని ముందుకు నడిపించి తమ పనులు చక్కబెట్టుకుంటాయి.
ఈ లెక్కన నిజానికి బంగ్లాదేశ్ అనిశ్చితి అనేది ఒక సాకు మాత్రమే. అదే పాకిస్థాన్ కు ఈస్ట్ పాకిస్థాన్ తిరిగి ఇప్పిస్తాము, భారత్ పై మీ పగ తీరుతుందనే భ్రమ కల్పించి ఉంటారు. మరోవైపు చైనాకు ఈశాన్య రాష్ట్రాలపై పట్టు కావాలి. అందులోనూ అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించాలనే కుటిల నీతి చైనాది.
వెరసి గత కొద్ది దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాల క్రైస్తవీకరణ జరగడంతో పాటు అటువైపు భారత ప్రభుత్వం పూర్తిగా పట్టును కోల్పోయిందనే అనుకోవాలి.
ఇలా చైనా తన చివరి ప్రయత్నంగా ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి విడగొట్టేందుకు చుట్టూ ఉన్న దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకునే వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్ ను అస్థిరపరచింది. ఇందులో ఆ దేశ ప్రధాన షేక్ హాసీనా పాత్ర లేదని చెప్పలేము. ఎందుకంటే అంత సురక్షితంగా ఆమె దేశం దాటడం ముందస్తు ఏర్పాట్లు లేకుండా జరిగే వ్యవహారం కాదనేది గ్రహించాలి.
అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం బంగ్లాదేశీయులు పశ్చిమబంగకు వస్తే తాను ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. ఇప్పటికే అక్రమ వలసదారులతో రావణ కాష్టంగా మారిన ఆ పశ్చిమబంగలోకి ఇంకా చాలా మందిని రానివ్వడం అంటే కొరివితో తలగోక్కోవడమే.
అంటే ఇలా జరగబోతుందనే విషయం మమతా బెనర్జీకి ముందుగానే తెలిసి ఉండాలి.
తనకు ఓట్లు, సీట్లు, అధికారమే ముఖ్యం కాబట్టి అంతటి దుస్సహాసానికి తెగించి దేశభద్రతకే పెను సవాలుగా పరిణమించే ప్రయత్నం చేస్తోంది.
ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఓట్లు, సీట్లు, రాజకీయాలు అనే వ్యవహారాన్ని పక్కనబెట్టి కష్టమో నష్టమో దేశ భద్రతే ముఖ్యమనే ధోరణితో కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
అందుకు ప్రతిపక్షాలు నిర్ద్వంద మద్దతునివ్వాలి.
లేదంటే ఈశాన్య రాష్ట్రాలు చైనా ఆక్రమణలోకి వెళ్ళిపోవడం, కేరళ వంటి రాష్ట్రాలు ఇస్లామిక్ ఆక్రమణదారుల సొంతం కావడం, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పాకిస్థాన్ పట్టు పెరగడం వంటివి జరగడానికి ఎక్కువ సమయమేమి పట్టదు.
కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణి, మెతక వైఖరులను వీడకుండా ఇదే విధానం కొనసాగిస్తే 2026 డిసెంబరు నాటికి భారత్ పరిస్థితి బంగ్లాదేశ్ ల మారక తప్పదు.
కాబట్టి మొదటగా జన గణన చేపట్టి అందులోనూ కులాల గణనకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి.
తద్వారా రిజర్వేషన్ల అంశం కాస్త చల్లబడుతుంది. ఇక సమాంతరంగా ఖలీస్థానీలను, రిజర్వేషన్ల ముసుగులో ఉన్న కుట్రదారులను ఏరివేసేందుకు వీలు కలుగుతుంది.
లేదంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది.

Post a Comment

Previous Post Next Post