image source : opindia |
ఒకే దేశంలో రెండు విధానాలు, రెండు చిహ్నాలు, ఇద్దరు ప్రధానులు చెల్లుబాటు కావు అని నినందించారు జనసంఘ్ వ్యవస్థాపకులైన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆ మాటలు నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి జాతీయవాదిపై ఉంది. ఎందుకంటే దేశంలో ప్రజలంతా సమానమైనప్పుడు రెండు విధానాలు, రెండు చిహ్నాలు, ఇద్దరు ప్రధానులు ఎందుకు? నిజానికి ఈ మాటలు కాశ్మీర్ ప్రత్యేక ప్రత్తిపత్తిని ఉద్దేశిస్తూ అన్నారు. కానీ నేడు దేశవ్యాప్తంగా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముస్లింల కోసం పర్సనల్ లా బోర్డులు ఉన్నాయి. కానీ హిందువుల కోసం ఎటువంటి లా బోర్డులు కనిపించవు. మరీ అన్యాయం ఏమిటంటే 1950 సంవత్సరంలో హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చి హిందువులు తమ ఆచారవ్యవహారాలను ఎలా పాటించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. అదే మరోవైపు ముస్లింలపై ఎటువంటి ఆంక్షలను విధించలేదు.
అసలు రాజ్యాంగంలోనే మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పబడింది. అంటే ప్రజలంతా సమానమని. అది కాకుండా 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం ఎటువంటి మతపరమైన కార్యకలాపాల్లో భాగమవ్వకుండా ప్రజలందరినీ సమానంగా చూడాలని సెక్యులర్ పదాన్ని సోషల్ అనే పదంతో పాటు చేర్చారు. మరి దాని ఆచరణ కూడా లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానం కాదు, కొందరు మాత్రమే ప్రత్యేకం. వారిని సోకాల్డ్ మైనారిటీలుగా పిలుస్తూ వారికి ప్రత్యేక హక్కులతో పాటు భద్రతను కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. చట్టం కూడా అందరికీ ఒకటే ఉండాలి. కానీ అందుకు భిన్నంగా 1972లో ముస్లిం పర్సనల్ లా బోర్డును తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. అంటే వారి మతపరమైన ఆచారాలు వారు పాటించుకోవచ్చు అని కదా అర్థం. అంటే హిందువులు మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు ఉండాలా? ఇదెక్కడి విడ్డూరం.
రాజ్యాంగం ప్రకారమే చూసుకుందాం. ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానమే అన్నప్పుడు ముస్లింలు మాత్రం ఎందుకు ప్రత్యేకమయ్యారు? వారి పట్ల ప్రభుత్వాలు బుజ్జగింపు ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నాయి. వక్ఫ్ పేరుతో హిందువుల భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే ఎందుకు మౌనం దాల్చాయి. వక్ఫ్ క్లెయిమ్ చేసిన భూమి వక్ఫ్ ది కాదని వక్ఫ్ బోర్డే నిర్ణయించాలనే ప్రత్యేక అధికారాన్ని గత ప్రభుత్వాలు ఎందుకు కట్టబెట్టాయి? అందుకు కదా వీధికొక ఇస్లామిక్ ప్రార్థన మందిరాలే కాదు గల్లీ నుంచి దిల్లీ దాకా హైవేలను సైతం ఆక్రమిస్తూ అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటి పేరుపైన వక్ఫ్ ప్రాపర్టీలు అక్రమంగా ఏర్పడ్డాయి. కేవలం తమ ఆస్తి అన్నంత మాత్రానా ఆ ఆస్తి వక్ఫ్ జాబితాలో వెళ్లిపోతుంది. అది ప్రైవేటు ఆస్తి ఇక వివాద పరిష్కారం కోసం వారు వక్ఫ్ బోర్డు వద్దకే వెళితే బాధితులకు ఏ కోణంలో న్యాయం జరుగుతుంది. అంటే ముస్లింలు ప్రత్యేకమనే సంకేతం ఇక్కడ స్పష్టపడినట్లు అయ్యింది. ఈ లెక్కన దేశంలో ప్రజాస్వామ్యం స్ఫూర్తికి తూట్లు పొడిచి సమాజంలో విభజనకు తెరలేపిన గత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పరిహాసమాడాయి.
హిందువులు భారతీయ చట్టాలను మాత్రమే పాటించాలి. కానీ ముస్లింలు తమ పర్సనల్ లా బోర్డు ద్వారా హక్కులను పొందుతారు. వారికి వారి చట్టాల ప్రకారం రక్షణ లభిస్తుంది. వారి ఆచారవ్యవహారాలను కాపాడుకునేందుకు పర్సనల్ లా బోర్డు పనిచేస్తుంది. ఇస్లామిక్ మతపరమైన కట్టడాలపై ప్రభుత్వానికి ఎటువంటి ఆజమాయిషీ ఉండదు. అంటే పూర్తి స్వేచ్ఛను ముస్లింలకు గత ప్రభుత్వాలు కల్పించాయి. అదే హిందువుల విషయానికి వస్తే దేవాదాయ శాఖ అని ఏర్పాటు చేసి దేవాలయాల్లో ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆస్తులు కబ్జాకు గురైనా వాటిని పట్టించుకోద్దు. పురాతన ఆలయాలు జీర్ణావస్థకు చేరినా వాటి దిక్కు చూడదు. ఎంతసేపు హిందువులను ఎలా దోచుకోవాలనే ప్రణాళికలే ఉంటాయి. అందులోనూ ఆంక్షలు, నిబంధనలు అదనం. అంటే డబ్బులిచ్చి కొట్టిచ్చుకోవడం వంటి పరిస్థితి ప్రభుత్వాల కారణంగా హిందువులకు ఏర్పడింది. మరి ఇక్కడ కూడా ముస్లింల పట్ల ప్రభుత్వాలు పక్షపాత ధోరణి కనబరుస్తున్నాయి. అంటే ఇది కూడా రాజ్యాంగాన్ని నవ్వులపాటు చేయడమే.
ఇక ఇవి సరిపోవని, ప్రజలంతా సమానం కాదు. కొందరు మరింత ప్రత్యేకమంటూ 1993లో మైనారిటీ కమీషన్ తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. 1980వ దశకంలోనే అందుకు బీజాలు పడ్డాయి కూడా. అంటే ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ, అపహాస్యం చేసేలా ప్రజలకు మెజారిటీలు మైనారిటీలుగా వర్గీకరించడమే మైనారిటీల పేరిట ముస్లింలు, క్రైస్తవుల పట్ల పక్షపాతాన్ని ప్రభుత్వాలు కనబరుస్తున్నాయంటే ఇంకెక్కడి ప్రజాస్వామ్యం. ఇంకెక్కడి రాజ్యాంగం? కేవలం రాజ్యాంగం అడ్డం పెట్టుకొని హిందువుల అంతమే కదా జరుగుతుంది ఒక లెక్కన చూస్తే. ఇప్పటికైనా జాగరుకులై ప్రభుత్వాలను ప్రశ్నించండి. దేశంలో ప్రజలంతా సమానమైనప్పుడు కొందరికి ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక రక్షణలు ఎందుకని నిలదీయండి. లేదంటే అప్పట్లో హిందువులని కొందరు ఉండేవాళ్లు అని చెప్పుకునే రోజులు రావడానికి ఎంతో కాలం పట్టదు. తస్మాత్ జాగ్రత్త.