పొరుగున ఉన్న బంగ్లాదేశ్ దుస్థితి చూస్తుంటే భారత్ భవిష్యత్తు కనిపిస్తోంది. భారత్ లో పెరుగుతున్న ముస్లిం జనాభా.. బంగ్లాదేశ్ సంకేతాలను మన ముందు ఉంచుతోంది. ఇక్కడి రాజకీయ అవసరాల నిమిత్తం ఓటు బ్యాంకు రాజకీయాలను కాపాడుకునే క్రమంలో నేతలంతా మైనారిటీలైన ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో చాలా చాలా బిజీగా ఉన్నారు. కులాలు ప్రాంతాలకు అతీతంగా హిందూవు అన్న వారిని గుర్తించి పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే భేదం లేకుండా విచక్షణారహితంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు దాడులకు గురవుతున్నారు.
మారణ హోమం సాగుతోంది. రిజర్వేషన్ల ముసుగులో సాగుతున్న ఆందోళన హిందువులకు గొడ్డలిపెట్టుగా మారింది. భయానక పరిస్థితులు సృష్టించి హిందువులను బంగ్లాదేశ్ నుంచి తరిమేసే కుట్ర సాగుతోంది. ఇల్లు, వాకిలి, ఆస్తులు, నగలు సంపాదించుకున్నదాంతో పాటు బంధుమిత్రులను అక్కడే వదిలేసి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయే ఉపద్రవాలు సృష్టిస్తున్నాయి జిహాది మూకలు.
దీంతో హిందువుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీయల్సిన దిస్తితి ఏర్పడింది. బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నికున్న ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టిన తరువాత, అరాచకవాద శక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. రక్షణ కల్పించాల్సిన పోలీస్ యంత్రాంగమే శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. అస్తవ్యస్తమైన ఈ పరిస్థితిలో అతివాద జిహాదీ శక్తులు అక్కడి మైనారిటీ వర్గమైన హిందూ సమాజంపై పెద్ద ఎత్తున విరుచుకు పడేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నాయి. అడ్డువదుపులేని జిహాదీ శక్తులు హిందువులపై కత్తులు, మారనాయుధాలతో స్వైర విహారం చేయడం మానవత్వానికి మచ్చగా మిగులుతోంది.
పాముకు పాలు పోస్తే తిరిగి కాటు వేసే తీరుగా.. కరోనా కష్ట సమయంతో మొదలుకొని, ప్రతినిత్యం ఆహారాన్ని అందజేస్తున్న ఇస్కాన్ దేవాలయాలను సైతం ధ్వంసం చేసి, నీలమట్టం చేయడం జిహాదీ జాతుల లక్ష్యంగా కనిపిస్తోంది. కనిపించిన దేవాలయాలన్నింటినీ కొల్లగొట్టి విగ్రహాలతో పాటు ఆస్తులను దోచుకు వెళ్లడం, హిందువు ఇళ్లలోకి చొరబడి, లూ టీలు చేస్తున్నారు. కనిపించిన హిందూ స్త్రీలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఈ దృశ్యాలను చూస్తుంటే మనసు తీవ్రంగా కలచి వేస్తోంది. భారతదేశానికి బంగ్లాదేశ్ కు ఉన్న బంధాలను తెంచివేస్తూ ఇందిరాగాంధీ సంస్కృతిక కేంద్రాన్ని కూల్చివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. బంగ్లాదేశ్ లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, మందిరాలు, హిందువుల పై దాడులు అవమానకరం.. ఆందోళనకరం.! ఇది పక్కా ప్రణాళికగా రిజర్వేషన్ల ముసుగులో హిందువులపై చేస్తున్న దాడి అనేది ప్రపంచం గుర్తించాలి.
బంగ్లాదేశ్ విమోచనానికి సంబంధించిన దృశ్యాలతో ముజీబ్ నగర్ లోని షాహిద్ మెమోరియల్ కాంప్లెక్స్ లో ఏర్పాటుచేసిన విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత హేయం. అయినప్పటికీ భారతదేశము శాంతి, సహనంతో ప్రజాస్వామ్య విలువలతో కూడిన దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నాడు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రిన్ పై జిహాది ముకలు దాడి చేస్తే భారత్ అండగా నిలబడి ఆశ్రయం కల్పించింది. నేడు ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి షేక్ హసీనాను సైతం ఆదేశం హత్య చేసేందుకు ప్రయత్నించి తరిమేస్తే విశ్వ గురువుగా ఉన్న భారత్.. స్త్రీ జాతికి ఆశ్రమం కల్పించి తన సహజమైన స్నేహాన్ని, గొప్పతనాన్ని చాటుకుని భారత్ ప్రపంచ దేశాలకు పెద్దన్నగా నిలుస్తూ.. తన గౌరవాన్ని మరింత విస్తరించింది.
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, మతపరమైన స్థలాలు, వ్యాపార సంస్థలు, హిందూ మైనారిటీల ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఆర్థిక వనరులను సమూలంగా తుంచి వేశారు. బంగ్లాదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఈ దారుణమైన దుశ్చర్యలు కొనసాగటం.. వేలాది మంది అమాయక హిందువులను పొట్టన పెట్టుకోవడం యదేచ్చగా సాగుతోంది. చివరకు హిందూ శ్మశాన వాటికలను కూడా జిహాది శక్తులు వదలకుండా ధ్వంసం చేశాయంటే, దాడులు ఎంత ప్రమాదకర స్థాయిలో జరుగుతున్నాయో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఆలయాలు భారీగా దెబ్బతిన్నాయి, బంగ్లాదేశ్‌లో వారి హింస, భీభత్సానికి గురికాని ఏ జిల్లా కూడా మిగిలలేదు.
దాదాపు 500కు పైగా స్థలాల్లో హిందువులపై దాడులు జరిగినట్లు అధికారిక అంచనా. కానీ అన ధికారికంగా వేలాది స్థలాల్లో దాడులు జరిగాయి, అయితే వాటిని మీడియా కూడా బయట పెట్టేందుకు వెనకడుగు వేస్తోంది.
భారత్ నుంచి విడిపోయిన సమయంలో బంగ్లాదేశ్‌లో 32% ఉన్న హిందువులు.. ఇప్పుడు 8% కంటే తక్కువగా ఉన్నారనీ, వారు కూడా నిరంతరం జిహాదీ మూఖల దౌర్జన్యాలకు గురవుతూనే ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మహిళలు, పిల్లలు, దేవాలయాలు, వారి విశ్వాసం, విశ్వాసాల కేంద్రాలు కూడా సురక్షితంగా లేవని విశ్వహిందూ పరిషత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అష్టకష్టాలు పడుతున్న మైనారిటీ హిందువుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోందనీ, వారికి బాసటగా నిలుస్తూ భద్రత కల్పించాల్సిన అంశాలపై ప్రపంచాన్ని కదిలించేందుకు హిందూ సమాజమంతా చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
బంగ్లాదేశ్ మైనారిటీలకు భద్రత కరువై, మానవ హక్కులు హరించి వేస్తున్నా భారత్ లోని ఏ ఒక్క లౌకికవాద శక్తులు కూడా స్పందించకపోవడం విచారకరం. భారతదేశంలో జంతువుల పై దాడి జరుగితేనే గగ్గోలు పెట్టే సెక్యులరిస్టులు.. బంగ్లాదేశ్ లో మనుషులను ఊచకోత కోస్తుంటే కూడా నోరు మెదపడం లేదుసరికదా, మాట మాట్లాడక పోవడం బాధాకరం. కట్టుకున్న భర్తల ఎదుటే భార్యలను, కడుపున పుట్టిన పిల్లల ఎదుట తల్లులను, తోబుట్టువుల కళ్ళముందే అక్కాచెల్లెలను అత్యాచారం చేస్తుంటే రోజున తప్ప ఏమీ చేయలేని దిగిన దౌర్భాగ్యస్థితి హిందువులది. దీనికంతటికి కారణమేమని ఆలోచిస్తే.. వారు హిందువుగా పుట్టడమే పాపం అయిపోయింది. హిందువుగా పుట్టడమే శాపం అయిపోయింది.
సందట్లో సడే మియా అన్నట్లు ఈ క్లిష్ట పరిస్థితిని సద్వినియోగం చేసుకుని జిహాదీలు సరిహద్దు దాటి భారత్ లో చొరబడేందుకు పెద్దఎత్తున ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదని హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో భారత భద్రతా దళాలు సరిహద్దులో కట్టుదిట్టమైన నిఘా పెంచి, ఎలాంటి చొరబాట్లకు,ఆక్రమణలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది.
బంగ్లాదేశ్‌లో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని.. అక్కడ హిందూ సమాజం సురక్షితంగా ఉండాలని విశ్వ వ్యాప్తంగా హిందూ సమాజం కోరుకుంటుంది.
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రసార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010