న్యూదిల్లీ, వార్తానిధి: హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ కు చెందిన అనుమానిత ఉగ్రవాది మహ్మద్ ఖలీల్ ను రాష్ట్రీ రైఫిల్స్ కు చెందిన రోమియో ఫోర్స్ జమ్మూ కాశ్మీర్ పూంచ్ లోని మాగ్నర్ లో జూలై 30న పట్టుకున్నారు. అతడిని తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉగ్రవాద నిందితుడి నుంచి విదేశీ పిస్టోల్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన యాక్టివ్ వాట్సాప్ నెంబర్ స్వాధీనం చేసుకోగా, దాని ద్వారా అతని హ్యాండ్లర్ పనులను నిర్దేశిస్తున్నట్లు రోమియో ఫోర్స్ గుర్తించింది.
#breakingnews #latestupdates #Indianarmy #rashtriyarifiles #romeo
Tags:
జాతీయ వార్తలు