నిజామాబాద్ జిల్లా, వార్తానిధి: బాల్కొండ గ్రామం లో 108 రోజులుగా అమృత ధార జన చైతన్య సేవ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి హనుమాన్ చాలీస పారాయణం చివరి ఘట్టానికి చేరుకుంది. అగస్ట్ 4 వ తారీఖు నుంచి నవంబర్ 19 శుక్రవారం కార్తీక పౌర్ణిమ వరకు కోటి హనుమాన్ చాలీస పారాయణం, మన్యం సూక్త మహా యాగం జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర నలుమూలల నుంచి 73 వేల మంది రిజిస్ట్రేషన్ ద్వారా వర్చువల్ గా పాల్గొన్నారని "అమృత ధార జన చైతన్య సేవ సంస్థ" నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ శనివారం బాల్కొండలోని అయ్యప్ప గుడి ప్రక్కన గల గ్రౌండ్ లో సాయంత్రం 6:00 గంటలకు 10,000 జంటలతో సామూహిక హనుమాన్ చాలీస పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.
ముఖ్య ఆహ్వానితులుగా శ్రీ శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారు (అఖిల భారత మనుమాన్ దీక్ష పీఠాధిపతి) పాల్గొంటున్నారని నిర్వాహకులు హరాచారి నారాయణ తెలిపారు..
Tags:
ఆధ్యాత్మికం