నేటి రాశిఫలాలు(18-11-2021)

 

మేష

ఈ రోజున చంద్రుడు మీ స్వంత రాశిలో కూర్చున్నాడు. కాబట్టి మీరు ఈ రోజు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అలాగే మీరు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఫలితంగా సామాజిక స్థాయిలో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు పనిచేసే చోట ఈ రోజు మీ ఆలోచనలతో పై అధికారులను కూడా ఆకట్టుకోవచ్చు.

వృషభ

ఈ రోజు వృషభ రాశి వారు ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ రోజున వీరు ప్రముఖమైన ఆధ్యాత్మిక వ్యక్తిని కలవడం వీరి మనస్సు సంతోషంగా ఉంటుంది. వీరు తమ జీవితం పట్ల సరికొత్త ఆలోచన చేస్తారు. తమ జీవిత గమన దిశను మార్చుకుంటారు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.

మిథున

ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు, ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ జీవితంలో కూడా ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు అన్నదమ్ములు లేదా అక్కచెల్లెమ్మలతో మంచి సమయాన్ని గడపవచ్చు. 

కర్కాటక

ఈ రోజు ఈ రాశి వారికి అంతా శుభఫలితాలే గోచరిస్తున్నాయి. పదోన్నతిని ఆశించిన వారు దానికి సంబంధించిన వార్తను వింటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి శుభఫలితాలు కలుగుతాయి. విదేశీ కంపెనీల్లో ఉద్యోగానికై ఇంటర్వ్యూకి వెళ్లిన వారికి ఈ రోజు వారు ఆశించిన దానికంటే మంచి ఫలితాలను పొందవచ్చు. మీ మనస్సులో ఉన్న అనవసర చింతలు కూడా తొలగుతాయి.

సింహ

ఈ రాశి వారికి చంద్రుడు మీ తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు. కావున మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా ఆప్యాయంగా ప్రవర్తిస్తారు. మీ ఇచ్చే మర్యాద వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఈరోజు నుండి తమ జీవితంలో యోగా-ధ్యానం నకు చోటు కల్పించవచ్చు. అదృష్టం మీకు ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. 

కన్య

ఈ రాశివారు ఈ రోజు ప్రతి పనిని పూర్తి ఏకాగ్రతతో చేయడానికి ఇష్టపడతారు. ఈ రోజున చంద్రుడు మీ ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నాడు. కావున మీరు ఈ రోజు చంచలత్వ మనస్సుతో ఉంటారు. మీ దృష్టి పని కంటే అనవసరమైన విషయాలపై ఎక్కువగా ఉంటుంది. మీ మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ఈ రోజున మీరు ధ్యానం చేస్తే మంచిది.

తుల

ఈ రోజున చంద్రుడు మీ ఏడవ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి మీకు నచ్చిన ఆహారాన్ని వండిపెట్టే అవకాశాలు ఉన్నాయి. వివాహాం కోసం ఎదురు చూసేవారికి ఈ రోజు వారి బంధువుల ద్వారా మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి.

వృశ్చిక

ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచిది. తేలికగా అరుగుదల అయ్యే ఆహార పదార్థాలను తినండి. ఇవి కడుపు నింపకపోవచ్చు కానీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు వారి ప్రత్యర్థుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు వారి అత్తమామల తరపు వ్యక్తులను కలవవచ్చు. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పదాలను ఉపయోగించండి. లేకుంటే దాని ప్రభావం మీ వైవాహిక జీవితంపై పడుతుంది.

ధనుస్సు

ఈ రాశి విద్యార్థులకు ఈ రోజున ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా విద్యా రంగంలో వస్తున్న అనేక సమస్యలను వీరు అధిగమించవచ్చు. ఈ రాశిచక్రంలోని వ్యక్తులు తమ భావాలను ప్రజల ముందు చాలా సరైన రీతిలో వ్యక్తం చేయగలరు. ఫలితంగా మీరు పనిచేసే చోట మీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

మకర

ఈ రోజు ఈ రాశి వారి కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితంలో వివిధ రంగాలలో మీరు రాణించగలరని గ్రహించవచ్చు. ఈ రోజున చంద్రుడు సంతోషకరమైన ఇంట్లో ఉండటం వల్ల మీ కుటుంబ జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇంటి నుండి దూరంగా ఉంటూ పని చేస్తున్న వారు ఈరోజు ఇంటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.

కుంభ

ఈ రోజు చంద్రుడు మీ రాశి నుండి మూడవ ఇంట్లో కూర్చున్నాడు. కాబట్టి కుంభరాశి వ్యక్తుల ప్రవర్తనలో మంచి మార్పులు అనేవి ఉంటాయి. ఈరోజు మీకు ఏదైనా విషయంపై కోపం వచ్చినా దానిని వ్యతిరేకించే బదులు ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతారు. మీకు తోబుట్టువులు ఉంటే, మీరు ఈ రోజు వారితో మంచి సమయాన్ని గడపవచ్చు. పని ప్రదేశం నుండి కుటుంబ జీవితం వరకు అన్ని రంగాలలో మీకు మంచి ఫలితాలు సూచిస్తున్నాయి.

మీనం

ఈ రాశి వారికి చంద్రుడు ఈరోజు రెండవ ఇంట్లో ఉన్నాడు. దీని వల్ల వీరు మాటలతో ఇతరులను ఆకర్షించగలరు. వీరికి ఈ రోజున అన్నిరంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ఏదైనా అమ్మకానికి పెట్టినట్లయితే ఈ రోజు మీకు మంచి డీల్ అనేది వస్తుంది. మీరు పనిచేసే చోట శ్రమతో పనిచేయడం, దానిపైనే మీ దృష్టిని ఉంచడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మీ కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post