కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

 


విలేకరి : సురేశ్ 

సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను అక్కన్నపేట మండల కాంగ్రెస్ నేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు.

అయితే కాంగ్రెస్ నాయకులు అక్కన్నపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జంగపెల్లి ఐలయ్య మాట్లడారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. వరి వేస్తె ఉరి అన్నట్లుగా వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు డబ్బులు ఖర్చు చేసి ప్రాజెక్టులు ఎందుకోసం కట్టారని ప్రశ్నించారు.

సిద్దిపేట కలెక్టర్ మాట్లాడిన తీరు బాగాలేదని.. తాను ఒక సివిల్ సర్వంట్ అని మరిచిపోయి..  ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు గుగులోత్ రాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు పిరెళ్ల లింగమూర్తి, గూగులోత్ పెద్ద రాజు, మాజీ ఎంపీటీసీ రమేష్, 

గుగులోత్ రాజు, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్, పోతారబోయిన రాజు, మండల యూత్ నాయకుడు మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post